AI4తెలుగు కి సహకరించండి, రామ్ మిరియాల కచేరీకి పాస్ గెలవండి.
మొట్టమొదటి తెలుగు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు AI చందమామ కథలు ప్రాజెక్టుల వెనుక ఉన్న స్వేచ్ఛ సంస్థ, అదే స్పూర్తితో ఇప్పుడు మొట్టమొదటి తెలుగు వాయిస్ అసిస్టంట్ రూపొందించే లక్ష్యంతో స్వేచ్ఛ గొంతుక అనే మరో ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టింది.
మా ఈ ప్రయత్నానికి తెలుగు భాషా ప్రేమికుల సహాయాన్ని కోరుతున్నాము. ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోవడానికి మీరు చేయాల్సినదల్లా మీ గొంతుకతో కొన్ని తెలుగు వాక్యాలను చదివి రికార్డు చేయడం. ఇలా సేకరించిన గొంతుకల డాటాసెట్, రాబోయేతరం అత్యాధునిక తెలుగు AI(కృత్రిమ మేధ) ని రుపోందించడానికి ఉపయోగించబడుతుంది.
ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి, మన స్వేచ్ఛ ఆఫీసులో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ కుటుంబ సభ్యులతో సహా పాల్గొనగలరు.
మీరు & మీ కుటుంబ సభ్యులతో సహా, కనీసంగా 50 తెలుగు వాక్యాలను రికార్డ్ చేయండి. ఈ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత, స్క్రీన్‌షాట్‌ని తీసి, ఆ ఫోటోని కచేరీకి పాస్‌గా ఉపయోగించండి.
voice.swecha.org కి లాగిన్ అయ్యి, మీ గొంతుకని రికార్డు చేయడం ప్రారంభించండి.